Saturday, December 22, 2007

చాక్లెట్ తయారి

ఏమండోయ్! మొన్నామధ్యన నేను చాక్లెట్ తయారు చేయడం నేర్చుకున్నాను. మా వైజాగ్ లో కాండీకోర్ట్ అని ఒక చాక్లెట్ షాపు ఉంది. ఆవిడ 2 రోజులపాటు చాక్లెట్ తయారి మరియు డెసెర్ట్ మేకింగ్ నేర్పారు. అది మీకు చెబుతాను.
కావలసిన పదార్ధాలు

డార్క్ చాక్లెట్
మిల్క్ చాక్లెట్
రోస్టు చేసిన నట్స్ (బాదం పప్పు,జీడిపప్పు మరియు పిస్తా ని వట్టినే బంగారు రంగు వచ్చేవరకు వేయించి ముక్కలు చేసిపెట్టుకోండి).
చాక్లెట్ మేకింగ్ మూస

తయారుచేయు విధానం

డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ ని సమాన పాళ్ళలో తీసుకుని తరిగండి. ఒక దళసరి స్టీలు గిన్నెలో వేసి డబల్ బాయిల్ చెయ్యండి అంటే స్టౌ మీద ఒక గిన్నెలో నీళ్ళు పోసి దాని మీద ఇంకో గిన్నె పెట్టి తరిగిన చాక్లెట్ ని వేసి బాగా కరిగే వరకు గరిటె తో తిప్పుతూ వేడి చెయ్యాలి. బాగా కరిగిన తరువాత స్టౌ మీదనుండి దించి చాక్లెట్ మూసలో నింపాలి. అందులో తరిగిన నట్స్ ని కూడా వేసి చాక్లెట్ తో నింపాలి. మూసని ఫ్రిజ్ లో పెట్టాలి (డీప్ ఫ్రీజర్ లో కాదు). కొద్ది సేపటికి చాక్లెట్ గట్టిపడిపోతుంది. ఫ్రిజ్ నుండి బయటకి తీసి మూసనుండి తయారైన చాక్లెట్ ని తీసి రంగు రంగుల ముచ్చికాగితాలతో చుడితే రుచికరమైన చాక్లెట్ రెడీ!
లేటెందుకు ట్రై చెయ్యండి

No comments: